Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Tuesday 21 March 2017

Brinjal potato curry(వంకాయ బంగాళాదుంప కూర)


కావాల్సినవి:

  • వంకాయలు ముక్కలు-1 కప్పు(4 వంకాయలు),
  • బంగాళాదుంప ముక్కలు -1 చిన్న కప్పు(1 పెద్ద దుంప),
  • ఉల్లిపాయ-1,
  • పచ్చిమిర్చి-2,
  • గరంమసాలా-1 టీ స్పూన్,
  • టమాటా-2,
  • నూనె-3 టేబుల్ స్పూన్స్,
  • అల్లం వెల్లుల్లి పేస్ట్-1 టీస్పూన్,
  • ఆవాలు-3/4 టీస్పూన్,
  • జీలకర్ర-1/2 టీస్పూన్,
  • ఎండు మిర్చి-1,
  • పచ్చి సెనగపప్పు-1/2 టీస్పూన్,
  • పసుపు-చిటికెడు,
  • ఉప్పు-తగినంత,
  • కారం-1/2 టీ స్పూన్,
  • కొత్తిమీర-కొద్దిగా.

తయారీ:
ముందుగా కడాయిలో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగపప్పు, ఎండు మిర్చి వేసి వేయించుకోవాలి.


ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి తరువాత బంగాళాదుంపలు వేసి 3 నిమిషాలు తక్కువ మంట మీద మగ్గించుకోవాలి.


 తరువాత వంకాయ ముక్కలు కూడా వేసి ఉప్పు చల్లి మరో 3 నిమిషాలు మగ్గించాక  టమాటా ముక్కలు, గరంమసాలా, కారం వేసి కలిపి పావు కప్పు నీరు పోసి, మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించుకుని చివరగా కొత్తిమీర చల్లి గిన్నెలోకి తీసుకుని వడ్డించుకోవాలి.


ఈ కూర అన్నం,చపాతీ,రోటిలో తినటానికి రుచిగా ఉంటుంది. 

No comments:

Post a Comment