Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Saturday 6 May 2017

brinjal fry/vankaya fry


కావాల్సినవి:
వంకాయలు-3/4 కేజీ ,ఉల్లిపాయలు-2,పచ్చి మిర్చి-3,అల్లం వెల్లుల్లి ముద్ద-1 టేబుల్ స్పూన్,పసుపు-చిటికెడు,ఉప్పు-తగినంత,కారం-1 టీ స్పూన్,కొత్తిమీర-కొద్దిగా ,నూనె-3 టేబుల్ స్పూన్స్,పచ్చి సెనగపప్పు-1/2 టీ స్పూన్,ఎండు మిర్చి-1,జీలకర్ర-కొద్దిగా,ఆవాలు-3/4 టీ స్పూన్.


తయారీ:
ముందుగా వంకాయలని పొడవు ముక్కలుగా కోసుకుని ఉప్పు నీటిలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి, అలానే ఉల్లిపాయల్ని కూడా పొడవుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె పోసుకుని వేడి అయ్యాక ఆవాలు,జీలకర్ర,పచ్చి సెనగపప్పు,ఎండు మిర్చి వేసి వేగాక ఉల్లిపాయముక్కలు,పసుపు,అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి.



తరువాత వంకాయ ముక్కలని నీటి లో నుండి తీసి కడాయిలో వేసుకుని ఉప్పు చల్లి మీడియం మంట మీద మూత  పెట్టి 5 నిమిషాలు మగ్గించుని తర్వాత కారం చల్లుకుని కలిపి మూత లేకుండా ముక్క మెత్తపడే వరకు వేయించుకొని చివరగా కొత్తిమీర వేసి కలిపి గిన్నెలోకి తీసుకుని వడ్డించుకోవాలి. ఈ కూర రైస్ లో  తినటానికి బాగుంటుంది. 

banana strawberry milk shake


కావాల్సినవి: అరటి పండ్లు -2, స్ట్రాబెర్రిస్-10, చల్లని పాలు -100 ml ,పంచదార-తగినంత, ఐస్ క్యూబ్స్-2/3(ఆప్షనల్)


తయారీ: ముందుగా మిక్సీ జార్ లో అరటి పండ్లు ,స్ట్రాబెర్రిస్ ని ముక్కలుగా కోసుకుని  వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి తర్వాత చల్లని పాలు,పంచదార,ఐస్ క్యూబ్స్ కూడా వేసి మరొకసారి మిక్సీ వేసుకుని గ్లాస్సెస్ లోకి తీసుకుని స్ట్రాబెర్రిస్ తో అలంకరించి అతిధులకు చల్లగా అందించాలి. 


నోట్:పంచదార లేకపోయినా పర్వాలేదు అరటి పండ్లు  వాడుతున్నాం కనుక తియ్యగా ఉంటుంది. అలానే ఐస్ క్యూబ్స్ లేనప్పుడు జ్యూస్ ని కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కావలసినప్పుడు వాడుకోవచ్చు. 

Monday 24 April 2017

Kommu senagala charu / Guggilla charu


గుగ్గిళ్ల చారు :
  • కొమ్ము శెనగలు ఉడకపెట్టిన నీరు - 1 కప్పు 
  • టమాటా -1
  • చింతపండు - చిన్న నిమ్మకాయ అంత 
  • కొత్తిమీర -2 రెమ్మలు 
  • ఉప్పు - తగినంత 
  • పసుపు - చిటికెడు 
  • రసం పొడి - 1/2 టీస్పూన్ 
తాలింపు కొరకు :
  • నూనె - 3 టేబుల్ స్పూన్లు 
  • జీలకర్ర - 1/4 టీస్పూన్ 
  • ఆవాలు - 1/4 టీస్పూన్ 
  • పచ్చిపప్పు - 1/2 టీస్పూన్  
  • మినపప్పు - 1/2 టీస్పూన్ 
  • ఇంగువ - చిటికెడు 
  • ఎండుమిర్చి -2
  • వెల్లులి - 2 రెబ్బలు 
  • కరివేపాకు - 2 రెమ్మలు 
తయారీ :

ముందుగా ఒక గిన్నెలో కొమ్ము శెనగలు ఉడకపెట్టిన నీరు, టమాటా ముక్కలు ,చింతపండు ,  ఉప్పు, పసుపు,  రసం పొడి మరియు 1/2 కప్పు నీరు పోసి బాగా మరిగించాలి. 

తర్వాత కడాయిలో నూనె పోసి , నూనె వేడెక్కిన తర్వాత తాలింపు కొరకు పెట్టుకున్న సామాను మరియు దంచిన వెల్లులి వేసి అవి చిటపటలాడిన తరువాత చారులో వేసి మరియొక నిమిషం మరిగించుకోవాలి, చివరగా కొత్తిమీర చల్లుకుని వేడి వేడి అన్నం లో వడ్డించుకుని తినడమే.  

Mealmaker curry / Soya chunks curry


కావాల్సినవి:

  • మీల్ మేకర్ -1 పెద్ద కప్పు,
  • ఉల్లిపాయ-1,
  • టమాటా-4,
  • పచ్చి మిర్చి-2,
  • పచ్చి కొబ్బరి పొడి-2 /3 టేబుల్ స్పూన్స్(ఆప్షనల్),
  • అల్లం వెల్లుల్లి పేస్ట్-1టేబుల్ స్పూన్,
  • గరం మసాలా-1 టేబుల్ స్పూన్,
  • కారం -1 టీ స్పూన్,
  • పసుపు-చిటికెడు,
  • ఉప్పు-తగినంత,
  • నూనె-3టేబుల్ స్పూన్స్,
  • ఆవాలు-3/4 టీ స్పూన్,
  • జీలకర్ర- 1/2 టీ స్పూన్,
  • పచ్చి సెనగ పప్పు-1/2 టీ స్పూన్,
  • కరివేపాకు-2రెమ్మలు,
  • కొత్తిమీర -కొద్దిగా.

తయారీ:స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, పచ్చిసెనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు వేయించి, మీల్ మేకర్ ని నీటిలో నుండి తీసి, నీరు లేకుండా పిండి  కడాయిలో వేసి ఉప్పు చల్లుకుని 3 నిమిషాల పాటు వేయించుకోవాలి.




తరువాత టమాటా ముక్కలు వేసి 2 నిముషాలు మగ్గించాక గరం మసాలా,కారం వేసి కలిపి 1/2 కప్పు నీరుపోసుకుని మూత పెట్టి మరో 10 నిముషాలు కూర దగ్గరికి పడే వరకు ఉడికించుకుని చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకుని వడ్డించుకోవాలి. ఈ కూర రైస్,చపాతీ,రోటిలో తినటానికి బాగుంటుంది.


గమనిక:మీల్ మేకర్స్ ని ముందుగా శుభ్రంగా కడిగి వేడి నీటిలో వేసి 30 నిమిషాలపాటు నాన పెట్టుకోవాలి. పెద్ద మీల్ మేకర్స్ ఐతే కట్ చేసుకుని వాడుకోవాలి. గరం మసాలా,కారం  మీ రుచికి తగినట్టుగా వేసుకోగలరు. 

Thursday 13 April 2017

Nalla Karam / Karapodi / Karivepaku karam / Andhra style spice powder


కావాల్సినవి :
  • మినపప్పు -3 టేబుల్ స్పూన్లు
  • పచ్చిపప్పు -1.1/2 టేబుల్ స్పూన్లు 
  • ధనియాలు - 1/2 కప్పు 
  • జీలకర్ర - 1 టేబుల్ స్పూన్ 

mango milkshake


కావాల్సినవి :

  • పండిన మామిడికాయ-1,

Wednesday 12 April 2017

Chikkudukaya fry / Lima beans fry / Andhra style beans fry


కావాల్సినవి :

  • చిక్కుడుకాయలు - 1/2 కేజీ 
  • ఉల్లిపాయలు - 1 పెద్దది 

cabbage senagapappu kura/ cabbage curry(క్యాబేజీ పెసరపప్పు కూర )


కావాల్సినవి:
  • క్యాబేజీ తరుగు-1 పెద్ద కప్పు,
  • పెసర పప్పు-3/4 కప్పు
  • అల్లం వెల్లుల్లి ముద్ద-1 టేబుల్ స్పూన్ 
  • నూనె-3 టేబుల్ స్పూన్స్
  • గరం మసాలా-1 టీ స్పూన్
  • ఆవాలు -1/2 టీ స్పూన్
  • జీలకర్ర-1/2 టీ స్పూన్
  • పచ్చి సెనగ పప్పు-1 టీ స్పూన్
  • ఉల్లిపాయ-1
  • కారం-1 టీ స్పూన్
  • పచ్చి మిర్చి-1 లేదా 2
  • కరివేపాకు- రెమ్మలు 
  • కొత్తిమీర-కొద్దిగా 
  • ఉప్పు-తగినంత
  • పసుపు-చిటికెడు

నోట్: పెసరపప్పుని 20 నిమిషాలు పాటు మంచి నీటిలో నాన పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి.

తయారీ:
ముందుక ప్రెషర్ కుక్కర్ లో సన్నగా తరిగిన క్యాబేజీ  వేసి శుభ్రంగా కడిగి, 1కప్పు నీరు పోసి 1 కూత  వచ్చే వరకు ఉంచి పక్కన పెట్టుకోవాలి.


తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిసెనగపప్పు, కరివేపాకు, పసుపు వేసి వేగాక, ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకువేయించుకోవాలి .


తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ మరియు నాన పెట్టుకున్న పెసరపప్పుని వేసి ఉప్పు చల్లి కలయపెట్టుకుని , మూత పెట్టి  మీడియం మంట మీద 10 నిమిషాలు మగ్గించుకోవాలి.


పెసరపప్పు మెత్త పడింది అనుకున్నప్పుడు గరం మసాలా,కారం వేసుకుని కలయపెట్టుకుని మరో 5 నిమిషాలు మగ్గించి , చివరగా కొత్తిమీర చల్లుకుని గిన్నెలోకి తీసుకుని వడ్డించుకోవాలి. ఈ కూర చపాతీ, రైస్, రోటి లోకి చాల రుచిగా ఉంటుంది. 

Monday 10 April 2017

Aloo gobi curry (Bangaladhupa cauliflower kura)


ఆలూ గోబీ కర్రీ :
బంగాళా దుంపలు-2,
క్యాలీఫ్లవర్ పువ్వులు-1 కప్పు,
 టమాటా ముక్కలు -1 కప్పు,
ఉల్లిపాయ-1,
అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టేబుల్ స్పూన్స్,
గరం మసాలా-1 టేబుల్ స్పూన్స్,
పచ్చి మిర్చి-2,
కారం-1 టీ స్పూన్,
ధనియాల పొడి-1/2 టీ స్పూన్,
ఉప్పు-తగినంత,
కొత్తిమీర-కొద్దిగా,
నూనె-2 టీ స్పూన్స్,
ఆవాలు-3/4 టీ స్పూన్,
జీల కర్ర-1/2 టీ స్పూన్,
పచ్చి పప్పు-1 టీ స్పూన్,
పసుపు-కొద్దిగా,
కరివేపాకు-2 రెమ్మలు.

తయారీ:ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె పోసి వేడి అయ్యాక ఆవాలు,జీలకర్ర,పచ్చి పప్పు,కరివేపాకు,పసుపు  వేసి వేగించి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి 2 నిమిషాలు వేయించాక  టమాటా ముక్కలు వేసి ముక్క మెత్తబడే వరకు మగ్గించుకోవాలి.


కారం,గరం మసాలా,ధనియాలపొడి వేసి కలిపి తరువాత   బంగాళాదుంప ముక్కలు,క్యాలీఫ్లవర్ ముక్కలు  వేసి ఉప్పు చల్లి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి.


తరువాత ముక్కలు మునిగే వరకు నీరు పోసి మరో  10 నిమిషాలు కూర దగ్గరికి పడే వరకు ఉడికించుకుని కొత్తిమీర చల్లుకుని గిన్నెలోకి తీసుకుని వడ్డించుకోవాలి.


ఈ కూర చపాతీ,రోటి,అన్నం లోకి  రుచిగా ఉంటుంది. 

Thursday 6 April 2017

Badam milk ,Badam palu

బాదంపాలు



కావాల్సినవి:
  • బాదంపప్పు -30
  • పాలు -1 లీటర్ 
  • పంచదార -1/4 కప్పు 
  • కుంకుమపువ్వు -4 రేకులు 
  • యాలకులు - 3
తయారీ : ముందుగా బాదంపప్పుని నానబెట్టి ,పొట్టు తీసి ,మిక్సీ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని పాలు పోసి బాగా మరిగించాలి.



పొంగు వచ్చే ముందు బాదంపప్పు పేస్ట్ వేసి 15 నిమిషాలు గరిటతో తిప్పుతూ పాలని మరిగించుకోవాలి.





పంచదార వేసి మరిఒక నిమిషం మరించి చివరిగా యాలకులపొడి మరియు కుంకుమపువ్వు వేసి వేడి తగ్గిన తరువాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా సేవించడమే .