Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Thursday 13 April 2017

Nalla Karam / Karapodi / Karivepaku karam / Andhra style spice powder


కావాల్సినవి :
  • మినపప్పు -3 టేబుల్ స్పూన్లు
  • పచ్చిపప్పు -1.1/2 టేబుల్ స్పూన్లు 
  • ధనియాలు - 1/2 కప్పు 
  • జీలకర్ర - 1 టేబుల్ స్పూన్ 
  • కరివేపాకు - 1 కప్పు 
  • ఎండుమిర్చి - 10 లేక 12
  • వెల్లులి రెబ్బలు - 4 లేక 5
  • చింతపండు - అర నిమ్మకాయ అంత 
  • నూనె - 4 టేబుల్ స్పూన్లు 
  • ఉప్పు - రుచికి సరిపడినంత 

తయారీ :
ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి, వేడెక్కిన తరువాత మినపప్పు మరియు పచ్చిపప్పు  వేసి 2 నిమిషాలు వేపుకుని ధనియాలు మరియు జీలకర్ర వేసి 2 నిమిషాలు  మాడకుండా వేపి పక్కన పెట్టుకోవాలి.


తరువాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఎండుమిర్చి మరియు కరివేపాకు 2 నిమిషాలు వేపి పక్కన పెట్టుకోవాలి.



మిక్సీ జార్ లో ముందుగా పప్పులు మరియు ధనియాలు వేసి పలుకుగా గ్రైండ్ చేసాక ఎండుమిర్చి ,కరివేపాకు ,వెల్లులి రెబ్బలు , చింతపండు మరియు ఉప్పు వేసి 1 నిమిషం గ్రైండ్ చేసుకోవాలి .


అంతే  ఎంతో రుచికరమైన కారంపొడి సిద్ధం.  

No comments:

Post a Comment