Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Wednesday 12 April 2017

Chikkudukaya fry / Lima beans fry / Andhra style beans fry


కావాల్సినవి :

  • చిక్కుడుకాయలు - 1/2 కేజీ 
  • ఉల్లిపాయలు - 1 పెద్దది 
  • టమోటా - 1 చిన్నది (ఆప్షనల్)
  • ఉప్పు - రుచికి సరిపడినంత 
  • పసుపు - చిటికెడు 
  • కారం - 1 టీస్పూన్ 
తాలింపు కొరకు 
  • నూనె - 3 టేబుల్ స్పూన్లు 
  • జీలకర్ర - 1/4 టీస్పూన్ 
  • ఆవాలు - 1/4 టీస్పూన్ 
  • పచ్చిపప్పు - 1/2 టీస్పూన్  
  • మినపప్పు - 1/2 టీస్పూన్ 
  • ఇంగువ - చిటికెడు 
  • ఎండుమిర్చి -2
  • వెల్లులి - 2 రెబ్బలు 
  • కరివేపాకు - 2 రెమ్మలు 

తయారీ
: చిక్కుడుకాయ ముక్కలని కొద్దిగా పసుపు వేసి ఉడకపెట్టి పక్కనపెట్టుకోవాలి. కడాయిలో నూనె పోయాలి .


నూనె వేడెక్కిన తరువాత తాలింపు కొరకు తీసుకున్న సామాను వేసి అవి చిటపటలాడిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు వేపి ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి.



ఉప్పు మరియు కొద్దిగాపసుపు వేసి 2 నిమిషాలు వేయించుకున్నాక టమాటా ముక్కలు వేసి 3 నిమిషాలు మగ్గించుకుని చివరగా కారం చల్లుకుని సర్వ్ చేసుకోడమే.   

No comments:

Post a Comment