Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Wednesday 15 March 2017

Mutton fry , Andhra style Mutton fry (మటన్ ఫ్రై)


కావాల్సినవి :
మటన్-1/2 కేజీ ,ఉల్లిపాయ-1, పచ్చిమిర్చి-2, జీలకర్ర-1 టీస్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద -2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా-1 టేబుల్ స్పూన్, నూనె-3 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క-కొద్దిగా, లవంగాలు-4, ఉప్పు-తగినంత, పసుపు-1/2 టీ స్పూన్, యాలకులు-2, కారం-1టీస్పూన్ .

తయారీ:
ముందుగా మటన్ ని చిన్న ముక్కలుగా కోసుకుని ఉప్పు పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద కొద్దిగా , కారం, నూనె, యాలకులు, దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకుని బాగాకలిపి ఒక గంట ఫ్రిడ్జిలో పెట్టుకుని తరువాత ప్రెషర్ కుక్కర్ లో వేసి 1కప్పు నీరు పోసి 3కూతలు వచ్చేవరకు ఉంచి పక్కన పెట్టుకోవాలి.


తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేగాక ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు,మిగిలిన అల్లం వెల్లుల్లి ముద్ద వేసి 2 నిమిషాలు వేయించుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ని



మరియు ఉడికించగా  మిగిలిన నీటిని కూడా వేసుకుని ,గరం మసాలా వేసుకుని కలిపి, మూత పెట్టకుండా  నీరు అంతా ఆవిరి అయ్యే వరకు ఉడికించి కూర దగ్గరికి పడినప్పుడు కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెలోకి తీసి వడ్డించుకోవాలి.

నోట్:మటన్ ముదురుగా ఉన్నదీ అయితే 4 కూతలా వచ్చే వరకు ఉంచండి అప్పుడే మటన్ బాగా ఉడుకుతుంది. ఉప్పు,కారం,మసాలా ఘాటు మీ రుచికి తగినట్టుగా వేసుకోగలరు. 

No comments:

Post a Comment