Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Monday 27 March 2017

Golibaje, Andhra style challa punugulu, Maida punugulu

గోలి బాజే ,చల్ల పునుగులు , మైదా పునుగులు


కావాల్సినవి :
  • మైదా పిండి - 1 కప్పు 
  • పచ్చిమిర్చి -4
  • కరివేపాకు -2 రెమ్మలు 
  • ఉల్లిపాయ -1
  • పుల్లని పెరుగు - 1/4 కప్పు 
  • బియ్యపిండి -3 టేబుల్ స్పూన్లు 
  • అల్లం ముక్కలు - 1 టీస్పూన్ 
  • సోడా ఉప్పు - 1/4 టీస్పూన్ 
  • కొత్తిమీర - రెండు రెమ్మలు 
  • జీలకర్ర -1/2 టీస్పూన్ 
  • ఉప్పు - రుచికి సరిపడినంత (1/2 టీస్పూన్)
  • నూనె - డీప్ ఫ్రైకి సరిపడినంత 
తయారీ :
ఒక గిన్నెలో తరిగిన ఉల్లిపాయ ,పచ్చిమిర్చి ,కరివేపాకు ,అల్లం ముక్కలు మేరకు తరిగిన కొత్తిమీర ,సోడాఉప్పు , ఉప్పు మరియు పెరుగు వేసి బాగా కలపాలి .


 అందులో మైదా పిండి , బియ్యపిండి మరియు జీలకర్ర వేసి బాగా కలిపి అరగంట పక్కన పెట్టుకోవాలి.


తరువాత కడాయిలో నూనె పోయాలి .నూనె వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం పిండి నూనె లో వేసి ఎర్రగా వేపుకోవాలి.


 అంతే రుచికరమైన పులుగులు తయారు.  


No comments:

Post a Comment