Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Friday 3 February 2017

Semiya payasam / Nuts payasam/ Kheer (సేమియా పాయసం)



For recipe in english

కావల్సినవి :
  • సేమియా - 1/2 కప్పు 
  • పంచదార -1/2 కప్పు 
  • నెయ్యి -3 టేబుల్ స్పూన్లు 
  • జీడిపప్పు -5
  • కిస్మిస్ -5
  • బాదంపప్పు -5
  • పిస్తా పప్పు -5
  • పాలు -1+1/2 కప్పు 
  • ఉప్పు - చిటికెడు 
  • కుంకుమ పూవు - 2 రేకులు 
  • యాలకలు -2
తయారీ :

 ముందుగా అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని ఒక స్పూను నెయ్యి వేసి ముక్కలుగా చేసి పెట్టుకున్న జీడిపప్పు ,కిస్మిస్ ,బాదంపప్పు ,పిస్తా పప్పు వేసి ఎర్రగా వేపి పక్కన పెట్టుకోవాలి.



తరువాత అదే గిన్నె లో మిగిలిన 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి సేమియాని వేసి ఎర్రగా వేపి అందులో ఒకటిన్నర కప్పులు పలు పోసి 10 నిమిషాలు పొంగు వచ్చే వరకు ఉంచాలి.



తరువాత పంచదార, వేపిన డ్రై ఫ్రూప్ట్స్ , యాలకుల పొడి మరియు కుంకుమ పూవు వేసి 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని చిటికెడు ఉప్పు కలిపి సర్వ్ చేసుకోడమే. అంతే అంతో రుచికరమైన సేమియా నట్స్ పాయసం తయారు.               






గమనిక :
  1. ఉప్పు సేమియాని పొయ్యే మీద నుంచి దించిన తరువాత  వేసుకోవాలి. లేదంటే పాలు విరగవచ్చు . 
  2. పంచదార సేమియా ఉడికిన తరువాత వేసుకోవాలి. 
  3. పాలు ఎక్కువ పోసుకోవడం వలన సేమియా ఆరిన తరువాత గట్టిగ అవ్వకుండా ఉంటుంది . 
  4. తీపి ఎక్కువ తినే వారు పంచదార మరికొంచెం వేసుకోగలరు.   

No comments:

Post a Comment