Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Tuesday 7 February 2017

Egg korma / Kodi guddu korma (ఎగ్ కుర్మా)


కావాల్సినవి:
ఉడికించిన కోడి గుడ్లు -2, పెద్ద ఉల్లిపాయ -1, టమాటా గుజ్జు -1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు -3 టేబుల్ స్పూన్స్, నాన పెట్టిన జీడీ పప్పు -10, నూనె -3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర -1 టీస్పూన్, దలచిన చెక్క -కొద్దిగా, బిర్యానీ ఆకు -1, లవంగాలు -3, పసుపు -కొద్దిగా, గరం మసాలా -1 టీస్పూన్, కారం -1 టీస్పూన్, ధనియాల పొడి -1 టీస్పూన్, ఉప్పు -తగినంత, కొత్తిమీర -కొద్దిగా.

తయారీముందుగా కడాయిలో 1 స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక చిటికెడు పసుపు వేసి దానిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడి గుడ్లు వేసి 2 నిమిషాలు కొద్దిగా ఎర్రగా అయ్యేలా వెంచుకుని వాటి మీద ఉప్పు, కారం చల్లుకుని పక్కన పెట్టుకోవాలి.



తరువాత మిక్సీలో పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసి మెత్తగా ముద్దగా చేసుకుని పక్కన పెట్టుకోండి. కడాయిలో మిగిలిన నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, పసుపు  వేసి ఓక నిమిషం వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.


తరువాత టమాటా గుజ్జు వేసి ఉప్పు చల్లుకుని 3 నిమిషాలు ఉడికించుకోవాలి. కొబ్బరి జీడీ పప్పు పేస్ట్ వేసి బాగా కలుపుకుని మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తరువాత కారం ,ధనియాలపొడి, గరంమసాలా వేసి కలిపి 1/2 గ్లాస్ నీరు పోసి నూనె బయటికి వచ్చే వరకు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.


 చివరగా కొత్తిమీర వేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లు మీద ఈ కూర వేసుకుని అతిథులకు  వడ్డించాలి. ఈ కూర అన్నం, చపాతీ, రోటీలోకి రుచిగా ఉంటుంది. (గుడ్లును  కూరలో వేసి కూడా ఉడికించుకోవచ్చు)

No comments:

Post a Comment