Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Monday 9 January 2017

semiya pulav(సేమియా పులావ్)


కావాల్సినవి : సేమియా -1 కప్పు , ఉల్లిపాయ-1, బంగాళాదుంప -1, క్యారెట్ -1 చిన్నది , పచ్చిమిర్చి -2, అల్లం - 1టేబుల్ స్పూన్ ,వెల్లులి -1 టేబుల్ స్పూన్ ,లవంగాలు -4, యాలకలు -3, చెక్క -2 ఇంచులు, అనాస పువ్వ -1, జీలకర్ర -1/2 టీస్పూన్ ,టమాటా -1 పెద్దది , గరం మసాలా -1 టీస్పూన్, ఉప్పు -తగినంత (1/2 టీస్పూన్), పసుపు -చిటికెడు ,కొత్తిమీర -2 రెమ్మలు ,పుదీనా -2 రెమ్మలు, నెయ్యి / నూనె -3 టేబుల్ స్పూన్లు.


తయారీ : ముందుగా కడాయిలో నూనె పోసి అది వేడెక్కిన తరువాత లవంగాలు, యాలకలు, చెక్క, అనాస పువ్వ  మరియు జీలకర్ర వేసిన తరువాత అల్లం మరియు వెల్లులి ముక్కలు వేసి 1 నిమిషం వేపుకోవాలి. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ,బంగాళాదుంప మరియు క్యారెట్ ముక్కలు వేసి 5 నిమిషాలు వేపుకోవాలి.


ఉప్పు మరియు పసుపు వేసి ఒకేసారి కలయబెట్టి టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుని రెండు కప్పుల నీళ్లు పోసి ఉప్పు సరిచూసుకుని మరుగుతున్న నీటిలో సేమియా మరియు గరం మసాలా వేసి దగ్గరపడే వరకు ఉడికించి చివరిగా కొత్తిమీర మరియు పుదీనాని వేసి సర్వ్ చేసుకోవడమే.

 
.          

1 comment:

  1. Good job.. chala happyga undhi telugulo oka blog chudadam. god bless you.

    ReplyDelete