Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Wednesday 7 December 2016

bendakaya fry/lady fingers fry(బెండకాయ వేపుడు)


కావాల్సినవి: లేత బెండకాయలు-1/2 కేజీ ,పెద్ద ఉల్లిపాయ-1, పచ్చిమిర్చి-3, కారం-1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు-2, ఆవాలు-3/4 టీ స్పూన్, మినపప్పు-1 టీస్పూన్, పచ్చిపప్పు-1 టీస్పూన్, జీలకర్ర-1/2 టీస్పూన్, కరివేపాకు-2 రెమ్మలు, ఎండుమిర్చి-1, కొత్తిమీర -కొద్దిగా, పసుపు-1/4 టీ స్పూన్, ఉప్పు-తగినంత, నూనె-3 టేబుల్ స్పూన్స్.



తయారీ: స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె పోసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు, వెల్లులి  రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. తరువాత బెండకాయ ముక్కలు వేసి ఉప్పు చల్లి అంతా కలిసేట్టు కలయపెట్టి మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం మంట మీద మగ్గించుకోవాలి.


తరువాత మూత తీసుకుని మరో 15 నిముషాలు మధ్యలో కలుపుకుంటూ ముక్క మెత్తపడే వరకు వేయించుకోవాలి. చివరగా కారం ,కొత్తిమీర వేసి కలిపి 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని కూరని గిన్నెలోకి తీసుకోవాలి.


No comments:

Post a Comment