Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Friday 9 December 2016

Mango dal, Mamidikaya pappu(మామిడికాయ పప్పు)


కావాల్సినవి : కందిపప్పు -1 కప్పు ,మామిడికాయ -1, పచ్చిమిర్చి -3, ఉల్లిపాయ -1 పెద్దది, కారం -1/2 టీస్పూన్ ,ఉప్పు -1/2 టీస్పూను ,పసుపు -1/4 టీస్పూన్ ,అల్లం -1 అంగుళం, కొత్తిమీర -2 రెమ్మలు .

తాలింపు కొరకునూనె -2 టేబుల్ స్పూన్లు, ఆవాలు -1/4 టీస్పూను, పచ్చిపప్పు-1 టీస్పూను, ఎండుమిర్చి-2, జీలకర్ర- 1/4 టీస్పూను, కరివేపాకు -2 రెమ్మలు, వెల్లుల్లి -3 రెబ్బలు.


తయారీ: ముందుగా కందిపప్పుని నీటితో శుభ్రపరుచుకోవాలి. కుక్కర్ లో కందిపప్పు ,తరిగిన ఉల్లిపాయలు, మామిడికాయ ముక్కలు ,సన్నగా తరిగిన అల్లం మరియు పచ్చిమిర్చి వేయాలి .తరువాత రెండు కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.


కడాయిలో నూనె పోసి తాలింపు సామాను వేసుకుని అవి చిటపటలాడిన తరువాత ఉడికించిన పప్పులో వేసి కలుపుకోవాలి. చివరిగా ఉప్పు ,పసుపు, కారం మరియు కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి . అంతే రుచికరమైన మామిడికాయ పప్పు రెడీ. 
గమనిక : మామిడికాయ బాగా పులుపుగా ఉంటె సగం కాయ సరిపోతుంది.      

No comments:

Post a Comment