Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Tuesday 13 December 2016

kakarakaya kaaram(కాకరకాయ కారం)


కావాల్సినవి : కాకరకాయ - 1/4 కేజీ , ఉప్పు -1/4 టీస్పూన్ ,పసుపు -1/4 టీస్పూన్ ,నూనె -4 టీస్పూన్స్.
తాలింపు కొరకు : ఆవాలు -1/4 టీస్పూన్ , జీలకర్ర -1/4 టీస్పూన్ , పచ్చిపప్పు- 1 టీస్పూన్ , మినపప్పు -1 టీస్పూన్ ,ఇంగువ -చిటికెడు ,కరివేపాకు -2 రెమ్మలు , ఎండుమిర్చి -2.

మసాలా : ఉల్లిపాయ -1, వెల్లులి - 3 రెబ్బలు, కొబ్బెరి ముక్కలు -3 టేబుల్ స్పూన్లు, కారం -1 టీస్పూన్, జీలకర్ర - 1/4 టీస్పూన్.


తయారీ: కాకరకాయ చెక్కు తీసి సన్నని ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లులి, కొబ్బరి ముక్కలు, కారం మరియు జీలకర్రని మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత కడాయి తీసుకుని నూనె పోసి అది వేడెక్కిన తర్వాత తాలింపు సామాను వేసుకోవాలి అవి చిటపటలాడిన తర్వాత కాకరకాయ ముక్కలు ఉప్పు మరియు పసుపు వేసుకుని ఎర్రగా వేపుకోవాలి.


తరవాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి మరో 5 నిమిషాలు పచ్చి వాసన పోయేవరకు వేపుకుని స్టవ్ ఆపుకోవాలి. ముద్దపప్పుతో కాకరకాయ కారం చాలా రుచిగా ఉంటుంది.
గమనిక : మసాలా కొరకు పచ్చి కొబ్బరి, ఎండుకొబ్బరి పొడి లేదా ఎండుకొబ్బరి ఏదైనా వాడవచ్చు.
         

No comments:

Post a Comment