Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Thursday 29 December 2016

godhuma ravva upma(గోధుమ రవ్వ ఉప్మా)


కావాల్సినవి: గోధుమ రవ్వ-1 కప్పు, నీరు-3 కప్పులు , ఉల్లిపాయ-1, టమాటా-1, పచ్చిమిర్చి-3, క్యారెట్-1, ఉప్పు-తగినంత, నూనె-2 టేబుల్ స్పూన్స్, పచ్చిపప్పు-1 టీస్పూన్, వేరుశెనగ పలుకులు-3 టేబుల్ స్పూన్స్, ఆవాలు-1/4 టీస్పూన్, జీలకర్ర-1/2 టీస్పూన్, కరివేపాకు-2 రెమ్మలు, ఎండు మిర్చి-1.


తయారీ: ముందుగా ఒక గిన్నె/కడాయి తీసుకుని నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు మరియు వేరుశెనగ పలుకులు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు ,కరివేపాకు, పచ్చి మిర్చి, క్యారెట్ ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించి, టమాటా ముక్కలు కూడా వేసి మరో 3 నిమిషాలు  మగ్గనివ్వాలి. తరువాత నీరు పోసుకుని ఉప్పు వేసి కలిపి ,నీరు మరుగుతునప్పుడు రవ్వని వేస్తూ కలుపుకోవాలి.


మూత పెట్టి మీడియం మంట మీద 10-15 నిమిషాలు  ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని కలిపి ప్లేటులోకి తీసుకుని నిమ్మకాయ రసం  చల్లి వడ్డించుకోవాలి. కారం పొడి, పంచదార, మామిడికాయ పచ్చడితో ఈ  ఉప్మా మరింత రుచిగా ఉంటుంది. 

No comments:

Post a Comment