Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Thursday 15 December 2016

Dondakaya masala curry(దొండకాయ మసాలా కూర)


కావాల్సినవి: దొండకాయలు- పావు కేజీ ,ఉల్లిపాయ- 1, టమాటా గుజ్జు -1 కప్పు, పచ్చిమిర్చి-2, నూనె-3 టేబుల్ స్పూన్స్, కరివేపాకు -2రెమ్మలు, కొత్తిమీర -కొద్దిగా, ఉప్పు -తగినంత, కారం -1 టేబుల్ స్పూన్.
మసాలా కోసం: ధనియాలు -2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర -1 టేబుల్ స్పూన్, మిరియాలు -5, తెల్ల నువ్వులు-2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి తురుము -2 టేబుల్ స్పూన్స్.


తయారీ: ముందుగా దొండకాయలని 4 బాగాలుగా విడిపోకుండా కోసుకుని ఉప్పు, పసుపు, నీరు పోసి 5-7 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత కడాయి పెట్టుకుని మసాలా కోసం తీసుకున్న పదార్ధాలు అన్ని నూనె లేకుండా వేయించుకుని మిక్సీలో వేసి నీరు పోసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.


తరువాత కడాయి స్టవ్ మీద పెట్టుకుని నూనె వేసి జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. తరువాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసి 2 నిమిషాలు వేయించుకుని దానిలో కారం, గరం మసాలా వేసి 1 నిమిషం వేయించుకోవాలి, టమాటా గుజ్జు వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి.


తరువాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా వేసుకుని మరో 3 నిమిషాలు ఉడికించుకుని దానిలో దొండకాయలు వేసి ఉప్పు సరిచూసుకోవాలి. మసాలా దొండకాయలకి పట్టేటట్టు తిప్పుకుని 2 నిమిషాలు ఆగి 1/2 గ్లాసు  నీరు పోసుకుని కూర దగ్గర పడే వరకు ఉడికించుకుని కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కూర చపాతీ, రోటి, అన్నం లోకి చాలా రుచికరంగా ఉంటుంది.


No comments:

Post a Comment