Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Thursday 1 December 2016

bendakaya pulusu(బెండకాయ పులుసు)


కావాల్సినవి: లేత బెండకాయలు -పావు కేజీ(2 ఇంచ్ సైజులో తరుగుకోవాలి) ,పెద్ద ఉల్లిపాయ-1, పచ్చిమిర్చి-3, పలుచగా చేసుకున్న చింతపండు గుజ్జు- 1/2 కప్పు, ఆవాలు-1/4 టీస్పూన్, పచ్చిపప్పు-1/2 టీస్పూన్, జీలకర్ర-1 టీస్పూన్, ఎండుమిర్చి-1, కరివేపాకు-2 రెమ్మలు, వెల్లుల్లి-2 రెబ్బలు, పసుపు-కొద్దిగా, ఉప్పు-తగినంత, కారం-1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి-1 టేబుల్ స్పూన్, సెనగ పిండి-2 టేబుల్ స్పూన్స్, పంచదార-1 టేబుల్ స్పూన్, కొత్తిమీర -తగినంత.



తయారీ: ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, ఎండు మిర్చి,కరివేపాకు, పసుపు వేసి వేయించుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయముక్కలు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి.


బెండకాయ ముక్కలు వేసి ఉప్పు, కారం ,ధనియాల పొడి వేసి కలియబెట్టి మరో 3 నిమిషాలు మగ్గించుకుని, చింతపండుగుజ్జు మరియు మంచి నీరు పోసుకుని 15 నిమిషాలు ఉడికించుకోవాలి. పులుపు ఎక్కువగా ఉంటె మరి కొంచెం నీరు పోసుకుని మీ రుచికి తగినట్టు సరిచుకోండి.


తరువాత బెండకాయ ముక్కమెత్తగా అయ్యింది ఏమో  చూసుకుని చివరగా సెనగ పిండిలో కొంచెం నీరు పోసుకుని పలచగా ఉండలు లేకుండా కలుపుకుని పులుసులో వేసుకొని,1 టేబుల్  స్పూన్ పంచదార కూడా వేసి  బాగా కలిసేట్టు తిప్పుకుని 2 నిమిషాలు ఉడికించి, కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి.ఈ  పులుసు అన్నం మరియు చపాతీ, రోటీలోకి రుచిగా ఉంటుంది.
గమనిక: పులుసు పలచగా ఇష్టపడే వారు సెనగపిండి కలుపుకోకండి. పులుపు,తీపి మీ రుచుకి తగినట్టు  సరిచూసుకోగలరు. 

No comments:

Post a Comment