Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Monday 7 November 2016

Nethi palav/ ghee pulav(నేతి పలావ్)



కావాల్సినవి :  బాస్మతి బియ్యం- 2 కప్పులు (రైస్ కుక్కర్ కప్), నెయ్యి -2 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ -1, పచ్చిమిర్చి -2/3, కొత్తిమీర -3 రెమ్మలు ,పుదీనా -2 రెమ్మలు, కరివేపాకు -2 రెమ్మలు, అల్లం వెల్లులి పేస్ట్ -1 టేబుల్ స్పూన్, జీడిపప్పులు - 5/8, చెక్క -1 అంగుళం ,లవంగాలు -3, యాలకలు -3, మరాఠి మొగ్గ -1, అనాసపువ్వు -1, ఉప్పు -1 స్పూన్ , పసుపు - 1/4 టీస్పూన్.



తయారీ
కుక్కర్ గిన్నె/రైస్ కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టుకుని నెయ్యి పోయాలి. నెయ్యి వేడి అయ్యాక చెక్క ,లవంగాలు, యాలకలు, మరాఠి మొగ్గ, అనాసపువ్వు వేసి ఒక నిమిషం వేపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి ,కరివేపాకు మరియు జీడిపప్పు వేసి ఒక నిమిషం వేగాక అల్లంవెల్లులి ముద్ద వేసి పచ్చి వాసన పోయేవరకు వేపుకోవాలి (సుమారు 2 నిమిషాలు). 


తర్వాత బియ్యం వేసి ఒకసారి కలపాలి. ఉప్పు మరియు పసుపు వేసి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసి కొత్తిమీర మరియు పుదీనా వేసి కుక్కర్ మూతపెట్టి మూడు విస్టల్స్ వచ్చేవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేదంటే రైస్ కుక్కర్ లో పెట్టవచ్చు. ఈ రైస్ ని కుర్మాతో కానీ చినెన్ కర్రీతో గాని తింటే బాగుంటుంది.    


గమనిక:
బియ్యంలో నీళ్లు పోసాక ఒకసారి ఆ నీటిని రుచి చూసి ఉప్పుని సరిచేసుకోవచ్చు. 



No comments:

Post a Comment