Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Monday 7 November 2016

kodi guddu pulusu/egg pulusu(కోడి గుడ్డు పులుసు)



కావాల్సిన పదార్ధాలు:  ఉడికించి పెంకు తీసిన కోడి గుడ్లు -4, ఉల్లిపాయ ముక్కలు -1 పెద్ద బౌల్ ,పచ్చి మిర్చి-3, చింతపండు -నిమ్మపండు అంత, అల్లం వెల్లుల్లి ముక్కలు -1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి-1 టీస్పూన్, కారం- 1 లేదా 2 టీ స్పూన్స్, పంచదార -1 టీస్పూన్, కరివేపాకు-2రెమ్మలు, కొత్తి మీర -కొద్దిగా, జీలకర్ర -1టీస్పూన్, పచ్చి పప్పు -1టీ స్పూన్, నూనె- 2టేబుల్ స్పూన్స్, ఉప్పు-రుచికి తగినంత, ఆవాలు-1/2 టీ స్పూన్, శెనగ పిండి-2 టేబుల్ స్పూన్స్.



తయారీ:  ముందుగా ఒక గిన్నెలో నూనె పోసుకుని జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు వేసి వేగాక అల్లం వెల్లుల్లి ముక్కలు ,పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొంచెం ఉప్పు చల్లి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తరువాత ధనియాల పొడి, కారం వేసి తిప్పి ,దానిలో ఉడికించి పెట్టుకున్న కోడి గుడ్లు కూడా వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి.


తరువాత చింతపండులో కొంచెం నీరు పోసుకుని రసం తీసుకుని ,ఆ రసాన్ని ఉల్లిపాయలలో పోయాలి. మరో గ్లాసు మంచి నీరు కుడా పోసి కొంచెం ఉప్పు సరి చూసుకుని, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. చివరగా శనగపిండి తీసుకుని దానిలో కొంచెం నీరు పోసుకుని ఉండలు లేకుండా పలుచగా కలుపుకుని ,దానిని పులుసులో వేసుకుని బాగా కలిసేట్టు  తిప్పుకోని,పంచదార కూడా వేసి  కలియబెట్టి మరో 10 నిముషాలు ఉడికించుకుని పులుసు చిక్కగా అయ్యాక  స్టవ్ ఆఫ్ చేసి కొత్తి  మీరతో అలంకరించుకుని వడ్డించుకోవాలి.ఈ పులుసు అన్నం,చపాతీలలోకి బాగుంటుంది.


గమనిక: పులుపు తక్కువ కావాలి అనుకునే వారు నీరు ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది . అలానే పంచదార కూడా మీ రుచికి తగినట్టు సరిచూసుకొండి. కోడి గుడ్లకి సన్నని గాటు పెట్టుకుంటే  పులుసు లోపలికి వెళ్లి తినేటప్పుడు రుచిగా ఉంటుంది. 


No comments:

Post a Comment