Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Thursday 3 November 2016

beetroot carrot juice(బీట్ రూట్ క్యారెట్ జ్యూస్)


కావాల్సినవి:
సన్నగా తరిగిన బీట్ రూట్ ముక్కలు -1కప్పు, క్యారెట్ ముక్కలు -1/2 కప్పు, కీరదోస ముక్కలు -1 కప్పు, నిమ్మరసం -2 టేబుల్ స్పూన్స్, ఉప్పు -తగినంత, నీరు -1 గ్లాస్.
తయారీ:
ముందుగా మిక్సీ జార్ లో కీరదోసముక్కలు, క్యారెట్ ముక్కలు, బీట్ రూట్ ముక్కలు కొంచెం ఉప్పు వేసి మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. తరువాత నీరు పోసుకుని మరోసారి మిక్సీ పట్టుకోవాలి. చివరగా నిమ్మరసం వేసి కలిపి గ్లాస్ లోకి పోసుకుని పుదీనాతో అలంకరించుకొని సర్వ్ చేయటమే. ఈ  జ్యూస్ తాగటం వలన రక్త హీనత సమస్య తగ్గుతుంది, అలానే మూత్రపిండాలు శుభ్రపడతాయి.మీ శరీర ఛాయకుడా పెరిగి అందముగా కనిపిస్తారు.


గమనిక: జ్యూస్ బాగా పల్చగా కావాలి అంటే ఎక్కువ నీరు పోసుకుని దానికి తగట్టు నిమ్మరసం మరియు ఉప్పు సరి చేసుకోగలరు. ఈ జ్యూస్ ని వడకట్టకుండా తాగితేనే ఎక్కువ ప్రయోజనం పొందుతారు. 


No comments:

Post a Comment