Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Friday 25 November 2016

pappula chekkalu/rice crackers(పప్పుల చెక్కలు)


కావాల్సినవి: వరి పిండి-1/2 కేజీ ,నాన పెట్టిన పెసరపప్పు-1 కప్పు, నాన పెట్టిన పచ్చి సెనగ పప్పు-1/2 కప్పు, వేయించిన వేరుశెనగ పప్పు పొడి-1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్-3 టేబుల్ స్పూన్స్, కారం-3 టేబుల్ స్పూన్స్, ఉప్పు-తగినంత, బటర్ లేదా వెన్న పూస  - 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర -2టీస్పూన్స్, నూనె-డీప్ ఫ్రై కి సరిపడినంత, కరివేపాకు-2 రెమ్మలు.


తయారీ: ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని వరిపిండి వేసుకుని ,దానిలో నూనె తప్ప పైన చెప్పిన అన్ని పదార్ధాలు వేసి, నీరు పోసుకుంటూ కొంచెం గట్టి ముద్దలా కలుపుకోవాలి. ముద్ద మరీ మెత్తగా ఉండకూడదు. కనుక కొద్దీ కొద్దిగా నీరు పోసుకుంటూ కలుపుకోవాలి.ఇలా కలుపుకున్న ముద్ద నుండి పిండి తీసుకుని చిన్న చిన్న గుండ్రని ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోండి.


పిండి చేతులకి అంటుకోకుండా నూనే అరచేతులకి రాసుకుంటూ ఉండాలి. తరువాత కొంచెం మందంగా ఉన్న ప్లాస్టిక్ కవర్ ని తీసుకుని దానికి నూనె రాసుకుని ముందుగా చేసుకున్న పిండి ఉండలు దాని మీద పెట్టుకుని ఒక్కోదాన్ని చేతితో అద్దుతూ చెక్కలా వత్తుకోవాలి .మధ్య మధ్యలో చేతికి నూనె తీసుకుంటూ అద్దుకుంటే పిండి చేతికి అంటుకోదు. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసుకుని బాగా వేడి అయ్యాక, చెక్కలని మెల్లగా ఒక్కొక్కటి తీసి నూనెలో వేసి ఎర్రగా అయ్యేవరకు రెండు వైపులా తిప్పుతూ కాల్చుకుని టిష్యూ  పేపర్ మీదకి  తీసుకోవాలి. అంతే కరకరలాడే  చెక్కలు రెడీ,ఈ చెక్కలు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి . 


గమనిక:చెక్కలు బాగా రావాలి అంటే పిండి సరిగా కలుపుకోవాలి లేదు అంటే చెక్క ప్లాస్టిక్ కవర్ కి అతుక్కుపోతోంది. చెక్కలు చేసేటప్పుడు చివరలు పగిలినట్టు ఉంటె పిండి మనం సరిగా కలుపుకున్నట్టు. అలానే వేరుశనగ పలుకులని కచ్చా పచ్చగా పొడి చేసుకోండి. ఉప్పు కారం మీ రుచికి తగట్టు సరి చేసుకోగలరు. ఒకేసారి 5 లేదా 10 చెక్కలని నూనెలో వేసుకుని కాల్చుకోవచ్చు.


No comments:

Post a Comment