Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Thursday 3 November 2016

tamato kura(టమాటా కూర)


కావాల్సినవి : టమాటాలు -3, ఉల్లిపాయ -1, ఉప్పు - తగినంత / ఆర టీస్పూను , పసుపు - చిటికెడు, కారం - 1/2 టీస్పూను, నూనె -2 టేబుల్ స్పూన్లు.

తాలింపు కొరకు :  ఆవాలు -1/4 టీస్పూను, జీలకర్ర -1/4 టీస్పూను, పచ్చిపప్పు -1/2 టీస్పూను, ఇంగువ - చిటికెడు ,మినపప్పు -1/2 స్పూన్ ,కరివేపాకు -2 రెమ్మలు, వెల్లులి -2రెబ్బలు, ఎండు మిరపకాయ -2.


తయారీ : ముందుగా కడాయిలో నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు సామాను వేసి దోరగా వేయించుకొవాలి. పప్పులు ఎర్రగా అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి.


 తర్వాత టమాటా ముక్కలు వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి, ఉప్పు,కారం మరియు పసుపు వేసి ఒకసారి కలయబెట్టాలి. తర్వాత 1 కప్పు నీళ్లు పోసి మూతపెట్టుకోవాలి. నీరంతా పోయే వరకు మగ్గనివ్వాలి. చివరిగా కొత్తిమీర చల్లుకుని స్టీవ్ ఆఫ్ చేసుకోవాలి.


        

No comments:

Post a Comment