Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Thursday 24 November 2016

gummadikaya kalagalupu kura(గుమ్మడికాయ కలగలుపు కూర)


కావాల్సినవి: గుమ్మడికాయ ముక్కలు-1 కప్పు, వంకాయ ముక్కలు-1 కప్పు, చిలకడదుంప ముక్కలు(స్వీట్ పొటాటో)-1 కప్పు, ఉల్లిపాయ-1, పచ్చిమిర్చి-3, చింతపండు గుజ్జు-2 టేబుల్ స్పూన్స్, బెల్లం తురుము-2 టేబుల్ స్పూన్స్, కారం-1టేబుల్ స్పూన్స్, ఉప్పు-తగినంత, కొత్తిమీర- తగినంత, నూనె-3 టేబుల్ స్పూన్స్.
తాలింపుకొరకు: ఆవాలు-1/4 టీస్పూన్, జీలకర్ర-1/4 టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు-2, పచ్చిపప్పు-1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి-2, కరివేపాకు-2 రెమ్మలు, పసుపు-3/4 టీస్పూన్.

తయారీ: ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.


తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు మగ్గనిచ్చి, గుమ్మడికాయ ముక్కలు, చిలకడ దుంపలు వేసి కొంచెం ఉప్పు చల్లి అన్ని కలిసేట్టు తిప్పుకుని 5 నిమిషాలు తక్కువ మంట మీద మగ్గించుకోవాలి. తరువాత వంకాయ ముక్కలు, కొత్తిమీర వేసి కలియబెట్టి 2 నిమిషాలు ఉంచాలి.


1 కప్పు నీరు పోసి 10 నిముషాలు ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికి కూర దగ్గరికి పడుతున్నప్పుడు చింతపండు గుజ్జు, కారం వేసి కలిపి మరో 5 నిమిషాలు ఉడికించి చివరగా బెల్లం వేసి అంతా కలిసేట్టు తిప్పి 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోని కొత్తిమీర చల్లి వడ్డించుకోవటమే.


No comments:

Post a Comment